Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 18 శ్లోకం 45
మోక్షసంన్యాసయోగ · శ్లోక 45
శ్లోక 45
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు ||౧౮-౪౫||
అనువాదం
స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు