Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 5
సాంఖ్యయోగ · శ్లోక 5
శ్లోక 5
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||౨-౫||
అనువాదం
నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు