Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 14
కర్మసంన్యాసయోగ · శ్లోక 14
శ్లోక 14
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||౫-౧౪||
అనువాదం
కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు; కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు