Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 20
కర్మసంన్యాసయోగ · శ్లోక 20
శ్లోక 20
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ||౫-౨౦||
అనువాదం
భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి జరిగితే/లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు