Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 6 శ్లోకాలు 24–25
ధ్యానయోగ · శ్లోక 24 మరియు 25
శ్లోక 24 మరియు 25
సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః ||౬-౨౪||
శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్ ||౬-౨౫||
అనువాదం
ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధియందు దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు