Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 21
గుణత్రయవిభాగయోగ · శ్లోక 21
శ్లోక 21
అర్జున ఉవాచ |
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే ||౧౪-౨౧||
అనువాదం
అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు