Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 49
సాంఖ్యయోగ · శ్లోక 49
శ్లోక 49
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||౨-౪౯||
అనువాదం
దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంను ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు