Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 శ్లోకం 22
కర్మసంన్యాసయోగ · శ్లోక 22
శ్లోక 22
యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః ||౫-౨౨||
అనువాదం
ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు