Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 20
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 20
శ్లోక 20
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసమ్భవాన్ ||౧౩-౨౦||
అనువాదం
ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు